రేపు కొలిమిగుండ్లలో PGRS కార్యక్రమం...
NDL: కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ శ్రీనివాసులు వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరిస్తామని పేర్కొన్నారు. అర్జీలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. ప్రజలు 1902 కు ఫోన్ చేసి వారి సమస్యలను తెలపవచ్చని ఆయన అన్నారు.