చించినాడ బ్రిడ్జి మరమ్మతు పనులను పరిశీలించిన జేసి

W.G: చించినాడ బ్రిడ్జి వద్ద చేపట్టిన మరమ్మతు పనులను గురువారం జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మరమ్మతు పనులను ఆకస్మికంగా పరిశీలించి, తగు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు ఎంత మేరకు పనులు పూర్తయినవి, ఇంకను పూర్తి చేయవలసిన పనులపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు.