నేడు ఎంపీ పర్యటన వివరాలు
నారాయణపేట జిల్లాలో ఎంపీ డీకే అరుణ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కోటకొండ చేరుకుని లబ్ధిదారులకు చేనేత పరికరాలు పంపిణీ చేయనున్నారు. అనంతరం భూనేడులో తాగునీటి శుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.