'దొంగతం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'
కృష్ణా: 60 ఏళ్లుగా తమ కుటుంబం జీవనోపాధి పొందుతున్న దుకాణాన్ని కొందరు వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేశారు. వాటిలో ఉన్న విలువైన వస్తువులు దోచుకెళ్ళారని 55 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ వహీద్ ఈరోజు అవేదన వ్యక్తం చేశారు. గుడివాడలోని దుకాణంలో చోరీ చేసిన వారిపై చర్యలు తీసుకొని, తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, దీనిపై ఆర్డీవో బాలసుబ్రమణ్యంకు వినతపత్రం అందజేశారు.