గల్ఫ్ యుద్ధం.. బయటపడ్డ మరో భారత నౌక

గల్ఫ్ యుద్ధం.. బయటపడ్డ మరో భారత నౌక

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య భారత ముడి చమురు అవసరాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. యుద్ధ ప్రాంతం నుంచి 'జగ్ లాడ్కి' అనే భారత చమురు నౌక సురక్షితంగా బయటపడింది. ప్రస్తుతం గల్ఫ్ నుంచి మొత్తం మూడు ట్యాంకర్లు భారత్ వైపు బయలుదేరాయి. దేశంలో ఇంధన నిల్వలపై ఆందోళన నెలకొన్న తరుణంలో ఈ నౌకల రాక కీలకంగా మారింది. ఈ నౌకల భద్రతను భారత నేవీ నిశితంగా పర్యవేక్షిస్తోంది.