విదేశీ ఆస్తులు వెల్లడించని వారిపై ఐటీ నజర్
ఐటీ రిటర్నుల్లో విదేశాల్లో ఉన్న ఆస్తులను వెల్లడించని వారిపై ఆదాయ పన్ను మంత్రత్వ శాఖ దృష్టి పెట్టింది. 25 వేల మందికి ఈ-మెయిల్, SMS ద్వారా హెచ్చరికలు పంపనుంది. ఈనెల 28 నుంచి SMS, email ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు, వీరు తమ ITRని సవరించి డిసెంబర్ 31లోగా సమర్పించాల్సి ఉంటుందని సూచించింది. అప్పటిలోగా చేయకపోతే చట్టపరమైన శిక్షను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది.