జిల్లాను మతసామరస్యంగా చేద్దాం: ఎస్పీ

అన్నమయ్య: జిల్లా ప్రజల సమష్టి కృషితో రాబోయే రోజుల్లో జిల్లాను మతసామరస్య జిల్లాగా చేద్దామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరగబోయే అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు, ప్రార్థనలు, ఊరేగింపుల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో సహృదయ వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని సూచించారు.