'రాష్ట్రం ఎటు పోతోందో అర్థం కావడం లేదు'
VSP: రాష్ట్రంలో పాలన గందరగోళంగా మారిందని, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నివాసంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమంపై స్పష్టత లేకుండా పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.