CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ELR: కైకలూరు మండలం వరాహపట్నం గ్రామంలో ఉన్న స్థానిక కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ క్యాంపు కార్యాలయం వద్ద శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 12 మంది లబ్దిదారులకు రూ.7,14,376 విలువైన చెక్కులు అందించారు. ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే వారికి ఆర్థిక సహాయం నిమిత్తం ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.