మంత్రి నుంచి ప్రశంసా పత్రం అందుకున్న విద్యార్థిని

ASR: మారేడుమిల్లి మండలం పందిరిమామిడికోటకి చెందిన గిరిజన విద్యార్థిని సాయిప్రియకు విజయవాడలో గురువారం మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశంసాపత్రం అందజేశారు. వై.రామవరం గురుకుల కళాశాలలో చదివిన ఆమె ఇంటర్ పరీక్షల్లో 981 మార్కులతో గురుకుల కళాశాలల్లోనే రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ రామకృష్ణ తెలిపారు.