పండుగపూట రామాలయంలో హుండీ చోరీ

పండుగపూట రామాలయంలో హుండీ చోరీ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పండుగపూట దొంగలు హల్చల్ చేశారు. రామాలయంలో హుండీని పగులగొట్టి అందులోని నగదును దొంగలు దోచుకెళ్లారు. ఇవాళ ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ పగిలి ఉండటాన్ని గమనించి ఆలయ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌తో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.