జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా శ్రీనివాసరావు బాధ్యతల

NLR: ఉదయగిరి ఏఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్‌గా వి.శ్రీనివాసరావు మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తూ పదోన్నతిపై ఉదయగిరికి వచ్చారు. కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కళాశాల అధ్యాపకులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.