'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

'ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి'

MDK: ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్ చరణ్ రెడ్డి సూచించారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల కళాశాలలో ప్లాస్టిక్ వ్యర్ధాలు, వాటి వాడకం వల్ల కలుగు అనర్ధాలు, ఘనపదార్థ వ్యర్ధాలు, వాటి నిర్వహణ, తడి, పొడి చెత్తపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.