గొంతులో ఇరుక్కున్న మటన్ ముక్క
MNCL: మటన్ కూరతో భోజనం చేసే క్రమంలో శ్రీనివాస్ అనే వ్యక్తికి ఊహించని విధంగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కున్న ఘటన చెన్నూర్‌లో చోటు చేసుకుంది. నీళ్లు కూడా మింగలేక తల్లడిల్లిన అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకురాగా ఎండోస్కోపీ చేసి గొంతులో నుంచి మటన్ ముక్కను తొలగించారు. ప్రాణపాయ స్థితి నుంచి రక్షించిన డాక్టర్‌కు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.