VIDEO: కార్తీక సోమవారం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు
KNR: గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి (సరస్వతి) ఆలయానికి కార్తీక సోమవారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. భక్తులు ఆలయ ఆవరణలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.