మర్చిపోయిన బ్యాగ్.. తిరిగి అందించిన పోలీసులు

మర్చిపోయిన బ్యాగ్.. తిరిగి అందించిన పోలీసులు

VSP: విశాఖపట్నం నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిన ఓ మహిళ, సెక్యూరిటీ చెక్ తర్వాత తన బ్యాగ్‌ను విమానాశ్రయంలోనే మర్చిపోయింది. బెంగళూరు చేరుకున్నాక విషయం గుర్తించి, తన సోదరుడి ద్వారా ఏపీ పోలీసులను సంప్రదించింది. వెంటనే స్పందించిన పోలీసులు, విమానాశ్రయ అధికారులతో కలిసి బ్యాగ్‌ను సురక్షితంగా గుర్తించి ఆమెకు అప్పగించారు. దీంతో పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.