జిల్లాలో భూప్రకంపనలు

జిల్లాలో భూప్రకంపనలు

ASR: ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో శనివారం రాత్రి భూమి కంపించింది. పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, అరకులోయ తదితర ప్రాంతాల్లో 30 సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత 4.4 గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒడిశాలోని సునాబెడలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు.