కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

కృష్ణా జిల్లాలో తగ్గిన చికెన్ ధరలు

కృష్ణా: జిల్లాలో చికెన్ ధరలు గత వారంతో పోల్చుకుంటే కొంతమేర తగ్గాయి. ఆదివారం జిల్లాలోని గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండలాల్లో గత వారంలో కేజీ చికెన్ రూ. 260లు ఉండగా, నేడు రూ. 230కి తగ్గింది. పెద్దబ్రాయిలేర్ రూ. 230, చిన్న బ్రాయిలర్ స్కిన్ లెస్ రూ. 230, విత్ స్కిన్ రూ. 220గా ఉన్నాయి. తగ్గిన ధరలు నేపథ్యంలో మాంసం దుకాణాల వద్ద కొనుగోలుదారుల సందడి నెలకొంది.