ఏయూ కాలేజీలకు పరీక్షా కేంద్రాల గుర్తింపు రద్దు
VZM: ఏయూ పరిధిలో పరీక్షా కేంద్రాలు నిర్వహించిన ఐదు కాలేజీలకు మూడేళ్ల పాటు గుర్తింపును రద్దు చేసినట్లు రిజిస్ట్రార్ రాంబాబు తెలిపారు. అవకతవకలపై ఫిర్యాదుల నేపథ్యంలో కొత్తవలసలోని ప్రగతి, వాగ్దేవి డిగ్రీ కళాశాలలు, జామిలో ఉదయ్ డిగ్రీ, ఎస్.కోటలో శ్రీ వివేకానంద డిగ్రీ–పీజీ, విజయనగరంలోని శ్రీ చైతన్య పీజీ కళాశాలల గుర్తింపును రద్దు చేశారు.