రైతులకు వ్యవసాయ అధికారిణి హెచ్చరిక

రైతులకు వ్యవసాయ అధికారిణి హెచ్చరిక

PDPL: పెద్దపల్లి మండలంలోని రైతులు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని మండల వ్యవసాయ అధికారి అలివేణి హెచ్చరించారు. గ్రామాల్లో అనధికార డీలర్లు విక్రయించే విత్తనాలను నమ్మరాదని, అధికార విత్తన డీలర్ల వద్ద నుంచే కొనుగోలు చేయాలన్నారు. విత్తనాలపై లేబుల్స్ పరిశీలించి కొనుగోలు చేయాలని, అనుమానాస్పదంగా అనిపిస్తే అధికారులను సంప్రదించాలన్నారు.