'కోచ్ అంటే ఏదో నిరూపించుకోవడం కాదు'
టీమిండియా కోచ్ అంటే ఎవరికో ఏదో నిరూపించుకోవడం అని తాను ఎప్పుడూ భావించలేదని గంభీర్ తెలిపాడు. భారత ప్లేయర్ల ఆటను ప్రపంచానికి చూపించడం, వారిని నమ్మి రక్షణ కవచంగా ఉండటమే తన పని అని స్పష్టంచేశాడు. డ్రెసింగ్ రూమ్‌లో ఉండేవాళ్లకు మాత్రమే తాను జవాబుదారీ అని.. వారి కోసం, దేశం కోసం నిజాయితీగా పనిచేయడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.