బిగ్‌బాస్ షోపై నారాయణ మరోసారి విమర్శలు

TG: బిగ్‌బాస్ షోపై CPI నారాయణ మరోసారి విమర్శలు చేశారు. సమాజానికి ఉపయోగంలేని షో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని పోలీసులు మొదలుకొని, జిల్లా కోర్టు వరకు తిరిగానన్నారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించి పిటిషన్‌ను స్వీకరించిందని వెల్లడిచారు. ఈ క్రమంలో నాగార్జునకు, నిర్వహకులకు కోర్టు నోటీసులు జారీ చేసిందని తెలిపారు.