పాక్ క్రికెట్ బోర్డుపై షాహిద్ అఫ్రిది ఫైర్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు తీరుపై మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్ కప్ వైఫల్యం తర్వాత తాజాగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ కూడా కోల్పోవడాన్ని అతడు తప్పుబట్టాడు. ఎవరికి ఏ ఫార్మాట్ కెప్టెన్సీ ఇవ్వాలో కూడా తెలియని అయోమయంలో సెలక్షన్ కమిటీ ఉందని విమర్శించాడు. ప్రస్తుత వన్డే జట్టు సారథి అఫ్రిది అల్లుడు షహీన్ అఫ్రిది కావడం గమనార్హం.