ALERT: రేషన్ కార్డులపై కీలక ప్రకటన

AP: రేపటి నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈకేవైసీ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ ఆలస్యమైందన్నారు. కొత్త కార్డులు, మార్పులు, చేర్పులు, చిరునామా మార్చుకోవచ్చన్నారు. రేషన్ కార్డుల మార్పు కోసం ఇప్పటి వరకు 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.