ప్రత్యేక పూజలు నిర్వహించిన ఝాన్సీ రెడ్డి
JN: పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఝాన్సీ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.