VIDEO: గ్రామాల్లో పెరుగుతున్న కుక్కల బెడద

ఆదిలాబాద్: భైంసా మండలం హజ్గుల్ గ్రామంలో వీధి కుక్కలు హడలెత్తిస్తున్నాయి. గ్రామంలోని పలు వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా రోడ్లపై సంచరిస్తున్నాయి. దీంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలినడకన వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుంచి కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు.