'ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్‌పై అవగాహన కల్పించాలి'
ADB: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ వివరాలను లబ్ధిదారులు స్వయంగా మొబైల్ యాప్ ద్వారా నమోదు చేసుకునే సౌకర్యం ఉందని, యాప్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. లబ్ధిదారులు యాప్ ద్వారా నిర్మాణ దశలను, పనుల పురోగతిని తామే నమోదు చేసుకోవడం ద్వారా పర్యవేక్షణ సులభతరం అవుతుందని పేర్కొన్నారు. దీంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.