గోపాలపురం రాకపోకలకు అంతరాయం

SKLM: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మహేంద్ర తనయ నది నుండి హెచ్ గోపాల్‌పురం, కాపు గోపాలపురం వెళ్లే కాజ్వే సోమవారం నీటితో మునిగింది. మహేంద్ర తనయ నది దాటి వెళ్ళవలసిన గ్రామ ప్రజలు నీటితో మునిగిని ఈ వంతెన వలన ఆ గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని వాపోయారు. మండల ప్రత్యేక అధికారి కరుణాకర్ ఇతర అధికారులు సోమవారం పరిశీలించారు.