పెద్దకాపర్తి సర్పంచ్‌గా కాటం వెంకటేశం

పెద్దకాపర్తి సర్పంచ్‌గా కాటం వెంకటేశం

NLG: చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ సర్పంచ్‌గా కాటం వెంకటేశం 746 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మండలంలోనే అత్యధికంగా ఈ గ్రామంలో ఆరుగురు అభ్యర్థులు పోటీలో నిలువగా.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కాటం వెంకటేశం విజయం పొందారు. ఏడు వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పాగా వేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశంకు వెంకటేశం అత్యంత సన్నిహితుడు.