రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ATP: గుత్తి మండలం వన్నెదొడ్డి గ్రామ సమీపంలోని 44 హైవేపై ఇవాళ రాత్రి ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి మరో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్ ఆసిఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.