'ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు'

ASR: యూరియా ఎరువు కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గూడెం కొత్తవీధి మండల వ్యవసాయ అధికారి డీ.గిరిబాబు బుధవారం ధారకొండ సచివాలయంలో రైతులకు తెలిపారు. రింతాడ-5 టన్నులు, దుప్పులవాడ-6, గుమ్మిరేవుల-6, ధారకొండ-3టన్నులు చొప్పున మండలానికి మొత్తం 20టన్నుల యూరియాకు ఇండెంట్ పెట్టామని చెప్పారు. అలాగే త్వరలోనే అదనంగా మరో 20టన్నుల యూరియా మండలానికి వస్తుందన్నారు.