'ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం'
MBNR: ప్రజలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. మంగళవారం మహబూబ్నగర్ రూరల్ మండలం కోటకద్ర గ్రామంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సంక్షేమానికి, రైతుల ఆర్థిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.