ప్రధాన రహదారిపై కొండచిలువ

ప్రధాన రహదారిపై కొండచిలువ

WGL: నెక్కొండ మండలంలోని పత్తిపాక గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై వాహనదారులకు శనివారం రాత్రి కొండచిలువ కనిపించింది. పత్తిపాక వైపు వెళుతున్న ఓ వాహన దారుడికి కొండ చిలువ కనిపించడంతో వాహనాన్ని ఆపి కొండ చిలువ రోడ్డు దాటే వరకు వేచి చూసి వెళ్లాడు. సమీపంలోని గుట్టలోకి వెళ్లినట్లు తెలిసింది. స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.