మహిళా కబడ్డీ జట్టుకు జగన్ శుభాకాంక్షలు
AP: ప్రపంచకప్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత మహిళా కబడ్డీ జట్టుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. వరల్డ్‌కప్ టైటిల్ గెలిచి జాతి మొత్తాన్ని గర్వపడేలా చేశారని కొనియాడారు. వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవడం మన అమ్మాయిల క్రమశిక్షణ, ఆట పట్ల వారికి ఉన్న నిబద్ధత, సమిష్టితత్వానికి నిదర్శనమని ప్రశంసించారు.