కాశీబుగ్గ మృతులకు వైసీపీ నేతల నివాళి
KKD: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని తునిలో ఆదివారం రాత్రి వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ ఘటనకు కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని వైసీపీ నాయకులు ఆరోపించారు. చంద్రబాబు హయాంలో ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం పరిపాటిగా మారిందని విమర్శించారు.