గొర్రెల మందపైకి దూసుకెళ్లిన లారీ!

KDP: జమ్మలమడుగు-తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఓ లారీ గొర్రెల మందపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంలో సుమారు 20 గొర్రెలు వరకు కూడా మరణించాయి. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.