బెల్ట్ షాపుల దంద.. అధిక ధరలతో ప్రజల దోపిడీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో బెల్ట్ షాపులు యధేచ్ఛగా కొనసాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో, ఈ షాపులు అధిక ధరలకు మద్యం అమ్ముతూ వినియోగదారులను దోచుకుంటున్నాయి. దీంతో యువత మద్యం వ్యసనాల బారిన పడుతున్నారు. ఈ అక్రమ వ్యాపారాన్ని అరికట్టడానికి అధికారుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది.