'యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దు'

KDP: యూరియా కోసం రైతుల ఆందోళన చెందవద్దని పొద్దుటూరు MLA నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వరి పంట నాట్ల సమయానికి రైతులందరికీ ప్రభుత్వం యూరియాని అందుబాటులోకి తెస్తుందన్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగనియదని, జిల్లా కలెక్టర్ వ్యవసాయ అధికారులతో మాట్లాడి రైతులకు అవసరమైన యూరియాను అందిస్తామని ఆయన తెలిపారు.