సర్జరీ తర్వాత మోదీకి ఎంపీ కొండా కృతజ్ఞతలు

సర్జరీ తర్వాత మోదీకి ఎంపీ కొండా కృతజ్ఞతలు

TG: సర్జరీ (ఓపెన్ హార్ట్ వాల్వ్ రీప్లేస్‌మెంట్) చేయించుకుని డిశ్చార్జ్ అయిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మోదీ స్వయంగా తనకు ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగారని, డాక్టర్ సలహాలను పాటించమని చెప్పారని తెలిపారు. ఇది గుండెను ఆపి చేసే పెద్ద ప్రక్రియ అని.. అయినా వైద్యులు, సాంకేతికతపై తనకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు.