యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

యువ వికాసానికి  దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

నల్గొండ: రాజీవ్ యువ వికాస పథకానికి ఏప్రిల్ 14లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకుగాను, గ్రామాలు, మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఒక కుటుంబానికి ఐదేళ్ల కాలంలో ఒకే సంక్షేమ పథకానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అన్నారు.