గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
MLG: జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ దివాకర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్కూల్‌లోని విద్యార్థుల వసతులు, పాఠశాల నిర్వహణ రికార్డులు, అలాగే విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యతపై అధికారులకు సూచనలు ఇచ్చారు.