సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
సత్యసాయి: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా 'అన్నదాత సుఖీభవ' నగదు రైతుల ఖాతాలో జమ అయినా సందర్భంగా నల్లమాడ మండల కన్వీనర్ మైలే శంకర ఇంటి వద్ద సీఎం చిత్ర పటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతుల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని కొనియాడారు.