విద్యుదాఘాతంతో రెండు మేకలు మృతి

WNP: పానల్ మండలం కేతేపల్లిలో గురువారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ చిన్న బీరయ్య మేకల మందను మేపుతుండగా, రెండు మేకలు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాయి. ఈ ఘటనలో తనకు దాదాపు రూ. 25 వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు స్పందించి, తనను ఆదుకోవాలని కోరాడు.