ఆకట్టుకున్న సూర్యదేవ వాహనంపై గణపతి విగ్రహం

SKLM: మరి కొద్ది రోజుల్లో జరగనున్న గణపతి నవరాత్రుల కోసం జలుమూరు మండలం నగరికటకం గ్రామంలో రాజన్న రవికుమార్ నిర్మించిన ఏడు గుర్రాల రథంపై గణపతి విగ్రహం ఏర్పాటు చేయడం అందరిని ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఈ విగ్రహాన్ని నిర్మించినట్లు ఆయన తెలిపారు. ముగ్గురు మనుషులు 10 రోజులు తయారు చేసినట్లు స్పష్టం చేశారు.