'న్యూమోనియా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి'

'న్యూమోనియా గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి'

ASR: ఈనెల 12న ప్రపంచ న్యూమోనియా దినోత్సవం సందర్భంగా 12నుంచి 18వరకు న్యూమోనియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని DMHO డా.కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని 64 PHCల పరిధిలో వైద్య, అంగన్వాడీ శాఖలతో కలిసి ర్యాలీలు, శిబిరాలు నిర్వహించాలన్నారు. న్యూమోనియా లక్షణాలు, నిరోధక చర్యలు గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు.