VIDEO: రొద్దంలో కల్వర్టు మరమ్మతులు ప్రారంభం
సత్యసాయి: రొద్దం మండలంలోని కెనరా బ్యాంకు సమీపంలో చిన్నయ్య టీ స్టాల్ సర్కిల్ వద్ద కల్వర్టు దెబ్బతినడంతో విద్యార్థులు, బ్యాంకుకు వచ్చే ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లగా స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని టీడీపీ నాయకులకు ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో బుధవారం కల్వర్ట్ మరమ్మతు పనులు ప్రారంభించారు.