VIDEO: పువ్వులతో అడిషనల్ కలెక్టర్‌కు స్వాగతం పలికిన చిన్నారులు
KNR: గంగాధర మండల కేంద్రంలో గురువారం గ్రామసభ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఆడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే హాజరయ్యారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న అంగన్వాడీ పాఠశాలల పిల్లలు అడిషనల్ కలెక్టర్ కారు దిగగానే ఆమెకు పువ్వులతో స్వాగతం పలికారు. చిన్నారుల పలకరింపుతో మురిసిపోయిన అదనపు కలెక్టర్ వారితో కాసేపు ముచ్చటించారు