ముప్ప గంగారెడ్డిపై ఎమ్మెల్యేకు ఫిర్యాదు

NZB: కిసాన్ కాంగ్రెస్ నాయకుడు ముప్ప గంగారెడ్డి పార్కు స్థలాన్ని కబ్జా చేస్తున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినాయక్ నగర్ భవానీనగర్ కాలనీవాసులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ఫిర్యాదు చేశారు. చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను కాలనీవాసులు కలిసి ఫిర్యాదుపత్రాన్ని అందజేశారు. ముప్ప గంగారెడ్డిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.