VIRAL VIDEO: 'మెర్సిడెస్ ఎయిర్‌లైన్స్'
రొమేనియాలో ఒక బెంజ్ కారు అతివేగంగా దూసుకెళ్లి రోడ్డుపై ఆగి ఉన్న రెండు కార్ల మీద నుంచి గాల్లోకి ఎగిరి పడింది. అయితే ఆ కారు డ్రైవర్ అస్వస్థతకు గురికావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కానీ డ్రైవర్ సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో 'మెర్సిడెస్ ఎయిర్‌లైన్స్' అంటూ నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు.