లబ్ధిదారులకు రూ. 15 లక్షల ఆర్థిక సాయం
SKLM: సామాన్య ప్రజలకు వైద్య సహాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం 29 మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు రూ.15 లక్షల చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం ఆర్ఎఫ్ ఎంతో ఉప యుక్తమని తెలిపారు.